భారతదేశం, అక్టోబర్ 30 -- IIFA Awards 2026: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 26వ 'ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ' (IIFA Awards 2026) విజేతల వివరాలు వచ్చేశాయి. తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా ఐఐఎఫ్‌ఏ నిర్వాహకులు శుక్రవారం (అక్టోబర్ 30) వివిధ కేటగిరీల విజేతల జాబితాను ప్రకటించారు. ఈ ఏడాది అవార్డుల వేడుకలో యంగ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధురంధర్' (Dhurandhar) సంచలనం సృష్టించింది.

పాపులర్ కేటగిరీలతో పాటు టెక్నికల్ విభాగాలలోనూ క్లీన్ స్వీప్ చేస్తూ ఏకంగా 12 ఐఐఎఫ్‌ఏ పురస్కారాలను 'ధురంధర్' చిత్రం సొంతం చేసుకుంది. అలాగే డిజిటల్ ఓటీటీ విభాగంలో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన సిరీస్ 'ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్' అత్యుత్తమ పురస్కారాలను కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా రణవీర్ సి...