భారతదేశం, ఆగస్టు 24 -- కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/టెక్ విభాగంలో 394 ఖాళీల భర్తీకి రిక్రూట్​మెంట్​ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తిగల అభ్యర్థులు నేటి నుంచే అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14, 2025 (రాత్రి 11:59 వరకు) అని గుర్తుపెట్టుకోవాలి.

ఎంపికైన జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (JIO-II)లకు లెవెల్ 4 ప్రకారం నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని భత్యాలు లభిస్తాయి. మొత్తం 394 ఖాళీల్లో అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి 157, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 32, ఇతర వెనుకబడిన తరగతులకు 117, షెడ్యూల్డ్ కులాలకు 60, షెడ్యూల్డ్ తెగలకు 28 కేటాయించారు.

ఐబీ జూని...