భారతదేశం, ఆగస్టు 8 -- ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ తన పాపులర్ ఎస్‌యూవీ 'క్రెటా' ఎస్​యూవీకి చెందిన నెక్ట్స్ జనరేషన్ మోడల్‌ను భారత్‌తో పాటు విదేశాల్లోనూ విస్తృతంగా పరీక్షిస్తోంది. లీకైన చిత్రాలు, స్పై షాట్ల ఆధారంగా ప్రముఖ డిజైనర్ 'న్యామమొత్' 2027 హ్యుందాయ్ క్రెటా రెండరింగ్ డిజైన్‌ను విడుదల చేశారు. ఈ మూడో తరానికి చెందిన సరికొత్త మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త కోనా పేరుతో కూడా హ్యుందాయ్ విక్రయించనుంది. 2027 ప్రారంభంలో ఈ నూతన మోడల్ ప్రపంచం ముందుకు రానుందని, అదే ఏడాది జరిగే 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో'లో ఇది అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు.

మారిన కస్టమర్ల రుచికి తగ్గట్టుగా ప్రీమియం, టెక్నాలజీతో కూడిన చిన్న ఎస్‌యూవీల డిమాండ్‌ను అందుకోవడానికి హ్యుందాయ్ ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేసినట్లు కొర...