భారతదేశం, జనవరి 10 -- సైబర్ మోసాలకు గురైన బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు. ఆ దిశగా హైదరాబాద్ నగర పోలీసులు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.బాధితులకు సహాయపడటానికి రూపొందించిన వర్చువల్ హెల్ప్ డెస్క్ 'సి-మిత్ర'ను శుక్రవారం ప్రారంభించారు. దేశంలోనే ఈ తరహా సేవలు రావటం ఇదే తొలిసారి అని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.
"హైదరాబాద్ లో సైబర్ నేరాల బాధితులు ఇకపై ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన పనిలేదు. ఏం రాయాలి? ఏ సెక్షన్లు వర్తిస్తాయి? అన్న ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు. బాధితులకు అండగా నిలుస్తూ, ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునేలా దేశంలోనే తొలిసారిగా 'సీ-మిత్ర' పేరుతో వినూత్న విధానాన్ని ప్రారంభించడం జరిగింది. కృత్రిమ మేథా (ఏఐ) సహకారంతో పనిచేసే ఈ వర్చువల్ హెల్ప్‌డెస్క్ ద్వారా ఫిర్యాదు ప్రక్రియ సులభ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.