భారతదేశం, మే 25 -- సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం అత్యంత ప్రమాదకర రీతిలో కారును రేసింగ్ ట్రాక్‌లా పరిగెత్తించిన ఒక యువకుడిని సైబరాబాద్ పరిధిలోని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏకంగా గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో లగ్జరీ కారును నడుపుతూ, ఇతర వాహనదారుల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టిన ఈ ఘటన ఇతరులను కూడా ఆందోళనకు గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని అల్కాపూర్ టౌన్‌షిప్‌కు చెందిన కొత్తపల్లి యశ్వంత్ రెడ్డి (32) అనే వ్యక్తిని ఈ కేసులో నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

గత మే 10వ తేదీ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదకర స్టంట్ చోటుచేసుకుంది. నిందితుడు యశ్వంత్ ర...