భారతదేశం, ఆగస్టు 21 -- Hyderabad road accident Case : మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఎదుట ఆగస్టు 16న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అతివేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ కారు ఢీకొట్టడంతో 26 ఏళ్ల సేల్స్‌వుమన్ దారుణంగా బలైంది. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చేపట్టిన దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

మృతురాలు భారతి ముఖి ఇనార్బిట్ మాల్‌లోని ఒక దుకాణంలో సేల్స్‌వుమన్‌గా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భారతి తన సహోద్యోగితో కలిసి భోజనం తెచ్చుకోవడానికి ఐటీసీ కోహినూర్ వైపు వెళ్లారు. భోజనం తీసుకుని తిరిగి వస్తూ, మాల్ ముందు భాగంలో రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో, తీవ్ర నిర్లక్ష్యంతో దూసుకొచ్చిన ఒక లగ్జరీ కారు భారతిని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర...