భారతదేశం, ఏప్రిల్ 8 -- నగరంలోని ఐటీ కారిడార్ లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. బ‌డా నిర్మాణ సంస్థ‌ల స్వాధీనంలో ఉన్న ప్ర‌భుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లోని స‌ర్వే నంబ‌ర్ 55లోని 8 ఎక‌రాల‌కు పైగా ఉన్న ప్ర‌భుత్వ భూమిని మంగ‌ళ‌వారం హైడ్రా స్వాధీనం చేసుకుంది.

ఐటీ హబ్ కి చేరువలో బడా రియల్ ఎస్టేట్ సంస్థల స్వాధీనంలో ఉన్న 4.20 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు.. కొల‌ను మాధ‌వ‌రెడ్డి కూతురు స‌బితకు చెందిన 4 ఎక‌రాల భూమిని కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇందులో తాత్కాలికంగా వేసిన షెడ్డులను తొలగించింది. ప్ర‌భుత్వ భూమిలో నెల‌కొల్పిన ఆర్‌సీసీ ప్లాంట్‌ను వాస‌వి నిర్మాణ సంస్థ స్వయంగా తొల‌గించుకుంది.

కార్మికుల‌ కోసం వేసిన తాత్కాలిక షెడ్డుల‌ను హైడ్రా తొల‌గించింది. మొత్తం 8 ఎకరాల‌కు పైగా ఉన్న ప్ర‌భుత్వ భూమిలో...