భారతదేశం, అక్టోబర్ 27 -- భాగ్యనగరంలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లను తలపించేలా వింత శబ్దాలు రావడంతో పాటు భూమి కంపించినట్లు అనిపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉదయాన్నే ఏం జరుగుతుందో అర్థం కాక, భయాందోళనలకు గురైన ప్రజలు తమ పసిపిల్లలను ఎత్తుకుని ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు.

ఇవాళ ఉదయం 9:15 గంటల ప్రాంతంలో ఈ ఊహించని సంఘటన జరిగింది. ముఖ్యంగా రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, అత్తాపూర్, ఎర్రబోడ, లంగర్‌హౌస్, కేశవస్వామినగర్ తదితర పరిసర ప్రాంతాల్లో వరుసగా భారీ వింత శబ్దాలు వినిపించాయి. సాధారణ శబ్దాలకు భిన్నంగా, ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దం రావడంతో భవనాల్లోని కిటికీలు, తలుపులు కంపించినట్లయిందని స్థానికులు చెబుతున్నారు.

అది భూకంపమా లేక వేరే ఏదైనా ప్రమాదం జరిగిందా అనే...