భారతదేశం, ఆగస్టు 30 -- భారత ఆటోమొబైల్ రంగాన్ని ఏలుతున్న దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్.. దేశీయ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఇచ్చింది. రాబోయే 2030 నాటికి ఏకంగా 26 కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ భారీ ప్రణాళికలో భాగంగా సరికొత్త డిజైన్, అత్యాధునిక సాంకేతికతతో క్రెటా, ఐ10 నెక్ట్స్ జనరేషన్ కార్లను తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది.

కాగా దేశంలో అత్యంత ఆదరణ పొందిన మిడ్‌సైజ్ ఎస్‌యూవీ 'క్రెటా'ను కంపెనీ మొదటిసారిగా స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో తీసుకురాబోతుండటం ఆటోమొబైల్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే రోడ్లపై పరీక్షలు జరుపుకుంటున్న ఈ నెక్ట్స్ జనరేషన్ క్రెటా, 2027 తొలి అర్ధభాగంలో అధికారికంగా రోడ్డెక్కే అవకాశం ఉంది.

రాబోయే నెక్ట్స్ జెన్ క్రెటాను 2027 ...