భారతదేశం, జూన్ 11 -- Hrithik Roshan: సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' మూవీ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ కోసం చాలా రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. మొదట ఈ రోల్ కోసం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌ను సంప్రదించారు. రజనీ, షారుఖ్ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ తెగ ఆరాట పడ్డారు. కానీ షారుఖ్ తన కూతురు సుహానా ఖాన్ డెబ్యూ మూవీ 'కింగ్' (King) షూటింగ్ తో చాలా బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ప్లేస్ లో ఇప్పుడు హృతిక్ రోషన్ ఎంట్రీ ఇచ్చారు.

'వెరైటీ ఇండియా' రిపోర్ట్స్ ప్రకారం.. హృతిక్ రోషన్ ఈ జైలర్ 2 సినిమాలో స్పెషల్ క్యామియో కోసం రానున్నారు. జూన్ 22, 23 తేదీల్లో చెన్నైలో ఆయన తన పార్ట్ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. హృతిక్ క్యారెక్టర్ కేవలం చిన్న సీన్ మాత్రమే కాదు, కథా గమనా...