భారతదేశం, అక్టోబర్ 9 -- Horror Thriller Web Series: సైకలాజికల్ హారర్, సూపర్ నేచురల్ థ్రిల్లర్స్ ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే భయాన్ని అందిస్తే ఆ కిక్కే వేరు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ఆడియన్స్ కి నిద్రలేకుండా చేస్తున్న లేటెస్ట్ కల్ట్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఖౌఫ్' (Khauf). 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టడమే కాకుండా ప్రతి సీన్ లోనూ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఈ సిరీస్ కు ఐఎండీబీలో 7.4 రేటింగ్ నమోదైంది.

గ్వాలియర్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయిన ఒక యువతి 'మధు' జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గతంలో తను ఫేస్ చేసిన ఒక దారుణమైన లైంగిక వేధింపుల (Sexual Assault) దాడి నుంచి బయటపడటానికి ఢిల్లీ వచ్చి ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో చేరుతుంది. అయితే అక్కడ ఆమెకు కేటాయించిన 'రూమ్ ...