భారతదేశం, నవంబర్ 26 -- Horror Thriller Series: హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకుల కోసం మరికొన్ని గంటల్లోనే కొత్త వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతుంది. రేపటి నుంచి అంటే ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి ఆహా ఓటీటీలో హారర్ థ్రిల్లర్ ఆంథాలజీ వెబ్ సిరీస్ 'రాతిరి' స్ట్రీమింగ్ కానుంది.

పాపులర్ ఓటీటీ వేదిక 'ఆహా' తన ఒరిజినల్ హారర్ అంథాలజీ వెబ్ సిరీస్ 'రాతిరి'ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ యాంకర్, నటి రష్మి గౌతమ్, తమిళ నటుడు నట్టి, దివ్య గణేశన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌పై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. 'రాతిరి' సిరీస్ నవంబర్ 27 శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఎం. కంపెనీ బ్యానర్‌పై ఈ హారర్ అంథాలజీ రాతిరి వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఇటీవల 'మా ఊరి పొలిమేర', 'పిండం', 'దహాన్', 'తంత...