భారతదేశం, మే 23 -- Horror Movie: ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని చిన్న చిత్రాలు సృష్టించే అద్భుతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ దర్శకులకు, మైక్రో బడ్జెట్ ఫిల్మ్ మేకర్స్‌కు కొండంత స్ఫూర్తిని ఇస్తుంటాయి. భారీ స్టార్ కాస్ట్, వందల కోట్ల హంగులు లేకపోయినా.. బలమైన కథాంశం ఉంటే బాక్సాఫీస్‌ను షేక్ చేయవచ్చని హాలీవుడ్ హారర్ మూవీ 'అబ్సెషన్' (Obsession) మరోసారి నిరూపించింది. మే 15న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా అమెరికా మార్కెట్‌లో ఒక రేంజ్‌లో దూసుకుపోతూ ట్రేడ్ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

పాప్ సామ్రాజ్య అధినేత మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భారీ బయోపిక్ 'మైఖేల్' (MICHAEL) చిత్రానికి అమెరికాలో గట్టి పోటీ ఎదురవుతోంది. వరుసగా మూడో రోజు కూడా 'అబ్సెషన్' మూవీ నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

ఒకరోజు వసూళ్లలో 'అబ్సెషన్' 3.2 మిలియ...