భారతదేశం, జూలై 21 -- భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్లోకి ప్రముఖ జపాన్ వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఎట్టకేలకు అడుగుపెడుతోంది! భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.

అన్ని అనుకున్నట్లు జరిగితే, వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో ఈ పవర్‌ఫుల్ ఈవీ ఎస్‌యూవీ భారత రోడ్లపైకి రానుంది. హోండా సంస్థ ఇటీవల ప్రదర్శించిన 'హోండా 0 ఆల్ఫా' కాన్సెప్ట్ ఆధారంగా ఈ కారు రెడీ అవుతోంది.

హోండా చేపడుతున్న గ్లోబల్ ప్రొడక్షన్ ప్రాజెక్టుల్లో భారత విభాగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.

ఈ మేక్ ఇన్ ఇండియా ఈవీ ప్రాజెక్ట్ కోసం హోండా దాదాపు రూ. 1,200 కోట్ల భారీ పెట్టుబడిని కేటాయించింది. కేవలం...