భారతదేశం, ఆగస్టు 12 -- హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐపీఓ స్టాక్ మార్కెట్‌లో అద్భుతమైన లిస్టింగ్​ని నమోదు చేసింది. బీఎస్‌ఈస ఎన్‌ఎస్‌ఈ రెండింటిలోనూ ఏకంగా 67% వరకు ప్రీమియంతో లిస్ట్ హైవే ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ షేర్లు లిస్ట్​ అయ్యాయి. ఆ వెంటనే రెండింటిలోనూ షేర్లు అప్పర్​ సర్క్యూట్​లో లాక్​ అవ్వడం విశేషం.

బీఎస్‌ఈలో హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేరు ధర రూ. 117 వద్ద లిస్ట్ అయింది. ఇది ఇష్యూ ధర అయిన రూ. 70 కంటే 67.14% ఎక్కువ! అలాగే ఎన్‌ఎస్‌ఈలో ఈ స్టాక్ రూ. 115 వద్ద లిస్ట్ అయింది. ఇది ఇష్యూ ధర కంటే 60% ఎక్కువ.

లిస్టింగ్ అయిన తర్వాత కూడా ఈ షేర్లు లాభాల పరంపరను కొనసాగించాయి. బీఎస్‌ఈలో ఈ స్టాక్ 5% అప్పర్ ప్రైస్ బ్యాండ్ అయిన రూ. 122.84ను తాకింది. దీంతో ఐపీఓలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఏకంగా 75.49% లాభాలు వచ్చాయి! ఎన్‌ఎస్‌ఈలో కూడా ఈ షేర్ ధర 5% అప్పర్ ప్రైస్ బ...