భారతదేశం, మార్చి 29 -- సినిమా ఇండస్ట్రీలో చేసిన మూవీస్ కంటే కూడా వచ్చిన విజయాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ సూపర్ హిట్లే అన్నీ మాట్లాడతాయి. ఫ్లాప్ లు వస్తున్న హీరోయిన్ పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోతుంది. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది అందాల భామ 'నిధి అగర్వాల్'. పవన్ కల్యాణ్, ప్రభాస్ తో సినిమాలు చేసిన ఈ భామ రాత మారలేదు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి హీరోలతో ఒక్క సినిమా చేయాలని చాలా మంది హీరోయిన్లు ఆశపడుతుంటారు. వీళ్లతో చేసిన ఒక్క సినిమా హిట్ అయినా కూడా ఆ హీరోయిన్ దశ తిరిగిపోతుంది. కానీ నిధి అగర్వాల్ కు మాత్రం బ్యాడ్‌ల‌క్‌ తప్పడం లేదు. పవన్, ప్రభాస్ తో చేసిన సినిమాలు నిధి అగర్వాల్ కు నెగెటివ్ రిజల్టే తెచ్చిపెట్టాయి.

పవన్ కల్యాణ్ తో హరి హర వీరమల్లు, ప్రభాస్ తో ది రాజాసాబ్ సినిమాల్లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా...