భారతదేశం, జూలై 30 -- Heartbeat season 3 OTT: ఇండియన్ డిజిటల్ స్పేస్‌లో హాలీవుడ్ హిట్ సిరీస్ 'గ్రేస్ అనాటమీ' తరహాలోనే ఆర్కే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన తమిళ వెబ్ సిరీస్ 'హార్ట్ బీట్' (Heart Beat) గత రెండు సీజన్లతో ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇప్పుడు మరింత ఉత్కంఠభరితమైన కథనంతో 'హార్ట్ బీట్ సీజన్ 3' ఓటీటీలోకి వచ్చేసింది.

పాపులర్ వెబ్ సిరీస్ 'హార్ట్ బీట్' సీజన్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ షురూ అయింది. ఇవాళ (జూలై 30, 2026) నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (JioHotstar) లో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఫస్ట్ నాలుగు ఎపిసోడ్లు రిలీజ్ చేశారు. ఇక ప్రతి గురువారం ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ కానుంది. ఈ సీజన్ కూడా 100 ఎపిసోడ్లు సాగనుందని తెలిసింది. సీజన్ 3 తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

హార్ట్ బీట్ మూడో సీజన్ ఆ...