భారతదేశం, జూలై 1 -- Heart Beat Season 3: సూపర్ హిట్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది. "ఒక ప్రపంచం రెండు అయింది. కానీ హార్ట్ బీట్ మాత్రం ఒకటే" అంటూ జియోహాట్‌స్టార్ (JioHotstar) వదిలిన లేటెస్ట్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఓటీటీ ఆడియన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూపర్ హిట్ మెడికల్ డ్రామా 'హార్ట్ బీట్' (Heart Beat) సీజన్ 3 అప్‌డేట్ ఫైనల్‌గా వచ్చేసింది. జులై 30 నుంచి ఈ సీజన్ గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు.

ఆర్కే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ హార్ట్ బీట్ వెబ్ సిరీస్ తమిళంతో పాటు తెలుగులోనూ ఓటీటీ ఆడియన్స్‌ను విపరీతంగా అట్రాక్ట్ చేసింది. సర్జికల్ ఇంటర్న్స్, డాక్టర్స్ లైఫ్‌లో ఉండే ప్రొఫెషనల్ ఛాలెంజెస్, రొమాంటిక్ ట్రాక్స్...