భారతదేశం, జూలై 11 -- Heart Beat 3 Teaser: యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అనే తేడా లేకుండా జియో హాట్‌స్టార్‌లో దుమ్మురేపిన మెడికల్ వెబ్ సిరీస్ 'హార్ట్ బీట్'. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న ఈ ఎమోషనల్ డ్రామా సీజన్ 3 రిలీజ్ డేట్ కొన్ని రోజుల కిందటే అఫీషియల్‌గా వచ్చేసింది. జులై 30 నుంచి ఈ సెన్సేషనల్ సిరీస్ కొత్త సీజన్ స్ట్రీమింగ్ కాబోతుండగా.. తాజాగా సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు.

సౌత్ ఇండియాలో ఇలాంటి ప్యూర్ మెడికల్ డ్రామాలు రావడం చాలా అరుదు. ఈ గ్యాప్‌ని ఫిల్ చేస్తూ వచ్చిన ఈ హార్ట్ బీట్ వెబ్ సిరీస్.. గత రెండు సీజన్లు ఆర్కే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ రైడ్‌లా సాగాయి. డాక్టర్ రీనా, డాక్టర్ రధి మధ్య ఉన్న రిలేషన్‌షిప్, ఎమోషన్స్ ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. మెడికల్ ప్రొఫెషన్‌లో ఉండే సవాళ్లు, కొత్తగా చేరిన ఇంటర్న్...