భారతదేశం, ఏప్రిల్ 15 -- HBO Max JioHotstar: ఇండియన్ ఓటీటీ (OTT) రంగంలో మరో అతిపెద్ద విప్లవం మొదలైంది. దేశీయ దిగ్గజం జియోహాట్‌స్టార్, గ్లోబల్ మీడియా పవర్ హౌస్ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (WBD) తమ భాగస్వామ్యాన్ని భారీగా విస్తరిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఒప్పందంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన HBO Max ఇప్పుడు అధికారికంగా జియోహాట్‌స్టార్ వేదికగా భారత్‌లోకి అడుగుపెట్టింది. దీనివల్ల హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల ప్రేమికులకు ఇకపై వెతుక్కునే పనిలేకుండా అన్ని అగ్రశ్రేణి చిత్రాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి.

ఇప్పటివరకు వార్నర్ బ్రదర్స్ లేదా హెచ్‌బీఓ కంటెంట్ వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉండేవి. కానీ ఈ కొత్త డీల్ ప్రకారం డీసీ స్టూడియోస్ (DC Studios), వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, హెచ్‌బీఓ ఒరిజినల్స్, మ్యాక్స్ ఒరిజినల్స్‌కు సంబంధించిన ప్రతి ...