భారతదేశం, మార్చి 19 -- Harish Shankar: పవర్ స్టార్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో 14 ఏళ్ల తర్వాత వచ్చిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. చాలా ఏళ్లుగా సాగి ఉగాది సందర్భంగా రిలీజైన ఈ సినిమాకు కొన్ని గంటల్లోనే సక్సెస్ మీట్ పెట్టారు. అంతేకాదు ఇందులో హరీష్ చేసిన కామెంట్స్ మరింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురువారం (మార్చి 19) థియేటర్లలో రిలీజైన విషయం తెలుసు కదా. కొన్ని గంటల్లోనే మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. "కల్యాణ్ గారి స్వాగ్.. కల్యాణ్ గారి డైలాగ్ డెలివరీ.. ఇవే టార్గెట్ గా పెట్టుకున్నా.. అవే చూపించా. ఒకవేళ కల్యాణ్ గారిని అద్భుతంగా చూపించడం కాకుండా.. అద్భుతమైన కథ, అద్భుతమైన కళాఖండాన్ని నా నుంచి ఆశించి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నాకు ఇదే వచ్చు. ఇలాగే తీస్తాను" అని అన...