భారతదేశం, అక్టోబర్ 2 -- Hanuman Ansh Producer: కేవలం రూ. 2 కోట్ల నామమాత్రపు బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ. 414 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ముదులిపిన సంచలన మూవీ 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) సీక్వెల్‌పై ప్రొడ్యూసర్ అనుప్రియ నాగర్ ఒక షాకింగ్ విషయం వెల్లడించారు. ఈ సినిమా వందల కోట్లు కొల్లగొట్టినప్పటికీ, రాబోయే పార్ట్ 2 కోసం అనవసరంగా బడ్జెట్ పెంచే ఆలోచన లేదని తేల్చి చెప్పారు.

సాధారణంగా ఒక సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయితే.. దాని సీక్వెల్‌కి నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్ పెంచి గ్రాండ్‌గా ప్లాన్ చేస్తారు. అయితే 'హనుమాన్ అంశ్' ప్రొడ్యూసర్ అనుప్రియ నాగర్ మాత్రం పూర్తి భిన్నమైన బాటలో పయనిస్తున్నారు. రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పార్ట్ 2 కోసం విచ్చలవిడిగా రూ. 10 కోట్లు లేదా రూ. 20 కోట్లు ఖర్చు పెడి...