భారతదేశం, మే 28 -- Hai Re Song: 'ఇట్లు అర్జున' (Itlu Arjuna) సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతున్న కొత్త హీరో అనీష్ (Aniesh) తన మొదటి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన మాటలు రాని ఒక విభిన్నమైన, ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ మొదటి సింగిల్ 'హై రే' (Hai Re) ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్న ఈ చిత్రంలోని మొదటి పాట ఇప్పుడు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ పాటను మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అద్భుతమైన మెలోడీగా మలిచారు. ట్రెండీ బీట్స్‌తో పాటు క్లాసికల్ ఎలిమెంట్స్ ఫ్యూజన్‌తో ఈ సాంగ్ చాలా రిఫ్రెషింగ్‌గా సాగుతుంది.

సాధారణంగా హై-వోల్టేజ్ మాస్ సాంగ్స్ ఇచ్చే స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ ఈ మెలోడీ నంబర్‌ను తనదైన ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాడారు. ఆయన పాడిన విధానం ఈ పాటకు మెయ...