భారతదేశం, సెప్టెంబర్ 21 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వలస విధానంలో తీసుకొచ్చిన మార్పులు వలసదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. హెచ్‌1బీ వీసా కోసం లక్ష డాలర్ల (సుమారు రూ. 83 లక్షలు) ఫీజు విధించనున్నట్లు ఆయన చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని, ఇప్పటికే వీసా ఉన్నవారికి కాదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఈ వివరణతో కొంత గందరగోళం తొలగింది.

టెక్నాలజీ కంపెనీల్లో నైపుణ్యం కలిగిన నిపుణుల కొరతను తీర్చడానికి ఉద్దేశించిన హెచ్‌1బీ వీసాలపై కొత్త ఫీజు విధిస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్​ సంతకం చేశారు.

అనంతరం.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పోస్ట్ చేస్తూ.. "ప్రస్తుతం దేశం వెలుపల ఉన్న హెచ్‌1బీ వీసా హోల్డర్లు తిరిగి అమెరికాలో...