భారతదేశం, సెప్టెంబర్ 20 -- హెచ్​1బీ వీసా వార్షిక ఫీజును 1లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసిన సంతకం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా చౌకగా దొరికే విదేశీ ఉద్యోగులపై ఆధారపడే అమెరికా టెక్​ కంపెనీలకు షాక్​ తగిలినట్టు అయ్యింది. ట్రంప్ విధించిన కొత్త నిబంధనల నేపథ్యంలో, గడువులోపు అంటే సెప్టెంబర్ 21లోగా తమ హెచ్1బీ, హెచ్4 వీసా కలిగిన ఉద్యోగులు వెంటనే అమెరికాకు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్ సంస్థ కోరినట్లు ఓ నివేదిక తెలిపింది.

హెచ్1బీ వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల రుసుము విధించిన ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే ఈ సూచనలు వెలువడ్డాయి.

రాయిటర్స్​కు లభించిన ఓ అంతర్గత ఈమెయిల్ ప్రకారం.. మైక్రోసాఫ్ట్ తమ హెచ్1బీ, హెచ్4 వీసా ఉన్న ఉద్యోగులను తప్పనిసరిగా అమెరికాకు తిరిగి రావాలని సూచించింది. అంతేకాకుండా హెచ్4...