భారతదేశం, నవంబర్ 25 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో సుమతి, అరుణ్ పెళ్లి విషయంలో మరోసారి బాలు, మీనా గొడవ పడతారు. సత్యం, ప్రభావతి ముందే పంచాయితీ పెడతారు. మరోవైపు సుమతి విషయంలో తప్పుగా మాట్లాడి బాలు చేతిలో దెబ్బలు తిన్న మనోజ్ మూతికి సీల్ పడుతుంది.

సుమతి పెళ్లి విషయం చెబుతూ అరుణ్ ప్రవర్తన గురించి సత్యంతో మీనా మాట్లాడే సీన్ తో సీరియల్ బుధవారం (నవంబర్ 25) ఎపిసోడ్ మొదలైంది. అరుణ్ అస్సలు మంచి వాడు కాదని, అతడు తనపై పగతో కావాలని సుమతిని ట్రాప్ చేసి ఇదంతా చేస్తున్నాడని బాలు అంటాడు. కానీ ప్రభావతి మాత్రం మీనాకు సపోర్ట్ చేస్తుంది. ఊళ్లో వాళ్లందరితో గొడవ పడుతూ ఉంటే ఇలాగే ఉంటుందని అంటుంది.

వాడు తన కార్ సీజ్ చేశాడని, చాలా ఇబ్బంది పెట్టాడని బాలు చెబుతాడు. సత్యం ముందే బాలు, మీనా గ...