భారతదేశం, సెప్టెంబర్ 16 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మనోజ్ కు చలి జ్వరం వస్తుంది. అతనికి సేవలు చేస్తున్న రోహిణిపై నిందలు వేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టడానికి ప్రభావతి ప్రయత్నిస్తుంది. మరోవైపు రెస్టారెంట్లో తనను టీజ్ చేసిన వారితో శృతి గొడవ పడుతుంది. తర్వాత జాబ్ మానేస్తుంది.

మీనా తన ఆర్డర్ కు డిపాజిట్ చెల్లించడానికి సుమతి డబ్బు సాయం చేసే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 16) ఎపిసోడ్ మొదలైంది. సుమతి డబ్బు తీసుకుంటూ మీనా ఎమోషనల్ అవుతుంది. ఇంకా నేను నీకు జడలు వేసి, స్కూలు పంపిస్తున్న జ్ఞాపకాలే ఉన్నాయి.. అప్పుడే ఇంత పెద్దదానివి అయిపోయావు.. ఆర్డర్ పూర్తి కాగానే డబ్బు తిరిగి ఇచ్చేస్తా అని మీనా అంటుంది. మా చదువుల కోసం నువ్వు నీ చదువు పక్కన పెట్టావు.. ఈ మాత్రం కూడా సాయం...