భారతదేశం, జూలై 27 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో శృతి తల్లి శోభన మరోసారి చెక్కు బుక్కు పట్టుకొని రచ్చ చేస్తుంది. ఇవి రవి, శృతి జీవితాల్లో మరో చిచ్చుకు కారణమయ్యే పరిస్థితి తీసుకొస్తుంది. అటు రోహిణికి మాణిక్యం రూపంలో మరో పెళ్లి గండం ముంచుకొస్తోంది.

బాలు, మీనా కలిసి పూలు సర్దే సీన్ తో సీరియల్ సోమవారం (జులై 27) ఎపిసోడ్ మొదలైంది. అప్పుడే మనోజ్ అక్కడికి వస్తాడు. తానో పెద్ద బిజినెస్ మ్యాన్ అంటూ మరోసారి పోజులు కొడతాడు. కూర మాడిపోతోందని మీనా లోనికి వెళ్లడంతో తనకు పూలు సర్దడంలో సాయం చేయాలని మనోజ్ ను బాలు అడుగుతాడు. అతడు మరింత బిల్డప్ ఇవ్వడంతో ఏదో శాపం పెట్టడానికి వెళ్తాడు. దీంతో మనోజ్ సరే అంటూ పూలు సర్దుతాడు.

ఈ క్రమంలో మనోజ్ తనకు రోహిణి ఇచ్చిన తాయత్తు పోగొట్టుకుంటాడ...