భారతదేశం, సెప్టెంబర్ 2 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ఎమోషనల్ గా సాగింది. చెల్లెలి చేత రాఖీ కట్టించుకోవడానికి బాలు వేచి చూడటం, చివరికి ఆమె వచ్చి అతన్ని అవమానించి పంపించడం, అది తెలిసి మీనా శపథం చేయడంలాంటి సీన్లతో సాగిపోయింది.

మౌనిక చేత రాఖీలు కట్టించుకోవడానికి బాలు, మనోజ్, రవి సంజూ ఇంటి ముందు వేచి చూసే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 2) ఎపిసోడ్ మొదలైంది. వాళ్లను లోనికి రానీయొద్దని సెక్యూరిటీకి చెబుతారు సంజూ, నీలకంఠం. కానీ మౌనిక బయటకు వచ్చి తన అన్నలకు రాఖీలు కట్టి పంపిస్తానని వాళ్లను వేడుకుంటుంది. కానీ వాళ్లు మాత్రం వినరు.

మౌనికను కూడా బయటకు పంపించడానికి అంగీకరించరు. బలవంతంగా లోనికి తీసుకెళ్లమని భార్యకు చెబుతాడు నీలకంఠం. ఆమె బాధగా లోనికి వెళ్లడం గేటు బయట నుంచి బ...