భారతదేశం, జూలై 9 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో బాలు, మీనా చేసిన త్యాగానికి అర్థమే లేకుండా పోతుంది. తన కళ్లు బాగవుతున్నాయని తెలిసిన వెంటనే మనోజ్ తన చిల్లర బుద్ధి చూపిస్తాడు. అయితే హాస్పిటల్లోనే అతనికి తగిన గడ్డి పెడతారు బాలు, మీనా.

మనోజ్ తన కళ్లు పోతాయేమో అని భయపడే సీన్ తో సీరియల్ గురువారం (జులై 9) ఎపిసోడ్ మొదలవుతుంది. మీనా, శృతి సహా ఇంట్లో వాళ్లందరూ తనకు ధైర్యం చెప్పడంతో మనోజ్ కుదుటపడతాడు. దీంతో ఇదేరా కుటుంబం అంటే అంటూ సత్యం అతనికి చెబుతాడు. ఎన్ని గొడవలు ఉన్నా ఒకరికి కష్టం వచ్చినప్పుడు అందరూ అండగా నిలవడమే ఓ కుటుంబం అవుతుందని అంటాడు.

అదే సమయంలో డాక్టర్ రావడంతో అందరూ బయటకు వెళ్తారు. బాలు, మీనా వెళ్లగానే రిసెప్షన్ లో పోలీస్ కనిపిస్తాడు. మనోజ్ గురించి ఆరా తీయడంతో అత...