భారతదేశం, జూలై 23 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మనోజ్ తన బర్త్ డే నాడే మరో రచ్చ చేస్తాడు. ఇంటికి వచ్చిన బాలు ఫ్రెండ్ రాజేష్ దంపతులను తినకుండా పోయేలా చేయడంతో బాలు విశ్వరూపం చూపిస్తాడు. ఇది కాస్తా ఇంట్లో పెద్ద రచ్చకు తెరలేపుతుంది.

చింతామణి మాజీ భర్త అయిన సింగరాజు దగ్గరే అప్పు చేసిన మీనా తిరిగి అతనికి డబ్బు ఇచ్చే సీన్ తో సీరియల్ గురువారం (జులై 23) ఎపిసోడ్ మొదలైంది. మీనాకు జరిగిన మోసం గురించి తెలుసుకున్న సింగరాజు.. నీకు అండగా ఉంటానని, భవిష్యత్తులో ఎంత పెద్ద ఆర్డర్ వచ్చినా ఎంత డబ్బయినా ఇస్తానని మాట ఇస్తాడు. దీంతో మీనా అతనికి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తన మాజీ భార్య ఫొటోను చూసి సింగరాజు ఆవేశపడతాడు.

అదే రోజు రాత్రి బాలు, మీనా ఆ మోసం గురించి మాట్లాడ...