భారతదేశం, ఏప్రిల్ 15 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రోహిణి చేసిన పనికి అందరి ముందూ ప్రభావతి దొంగలా నిలబడుతుంది. ఆమె తరఫున సంతకం చేయడానికి మనోజ్ అంగీకరించకోవడంతో సత్యమే సంతకం చేసి అప్పు తీర్చడానికి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఏప్రిల్ 15) ఎపిసోడ్ సత్యం, ప్రభావతి ఇంటికి కామాక్షి వచ్చే సీన్ తో మొదలవుతుంది. డబ్బు పోలేదని, డబ్బా మారిందని చెప్పి ఆ రూ.2 లక్షలు ఇచ్చేస్తుంది. దీంతో బాలు, మీనా కలిసి ప్రభావతిపై మండిపడతారు. అనవసరంగా కోడలిపై దొంగతనం ముద్ర వేశావంటూ భార్యను సత్యం నిలదీస్తాడు. అదే సమయంలో రోహిణిని కూడా ఇరికిస్తాడు.

మీనా ఆ ఇంటికి వెళ్లిన రోజు అంతకుముందే రోహిణి కూడా కామాక్షి ఇంటికి వెళ్లిందని సత్యం చెబుతాడు. దీంతో రోహిణి, మనోజ్ షాక్ త...