భారతదేశం, జూలై 21 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మీనా కష్టాన్ని రవి, శృతి ద్వారా తెలుసుకున్న బాలు.. వాళ్లతో కలిసే చింతామణి, మేనేజర్ కు సరైన బుద్ధి చెబుతాడు. ఓనర్ ముందే వాళ్లు అడ్డంగా దొరికిపోతారు. దీంతో మీనాకు రావాల్సిన రూ.9 లక్షలు సేఫ్ గా ఆమె చేతుల్లోకే వస్తాయి.

డెకరేషన్ తర్వాత మీనాను ఆమెకు సాయం చేసిన వాళ్లు డబ్బు అడిగే సీన్ తో సీరియల్ మంగళవారం (జులై 21) ఎపిసోడ్ మొదలవుతుంది. డబ్బు పోయిందని చెప్పలేక.. రేపటిలోగా కచ్చితంగా డబ్బు ఇస్తానని వాళ్లకు చెప్పి పంపిస్తుంది. కానీ అసలు డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో అని ఆలోచిస్తూ ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది.

ఇటు ఇంట్లో మీనాకు వచ్చిన కష్టంతో తెగ సంబరపడిపోతున్న ప్రభావతి.. మరింత శాడిజం చూపిస్తుంది. ఇక నుంచి మీనా...