భారతదేశం, నవంబర్ 12 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు తోటికోడళ్లు తమ బాధలను ఒకరితో మరొకరు పంచుకుంటారు. అయితే రోహిణి విషయంలో ప్రభావతి వెనక్కి తగ్గకపోగా.. సుమతి పెళ్లి విషయంలో బాలు మాట కాదని మీనా వెళ్లడం పెద్ద గొడవకు దారి తీస్తుంది.

నీతూని శృతి కలిసి రెస్టారెంట్ విషయం చెప్పే సీన్ తో సీరియల్ గురువారం (నవంబర్ 12) ఎపిసోడ్ మొదలైంది. తాను కొత్తగా రెస్టారెంట్ పెడుతున్నానని శృతి చెప్పడంతో నీతూ కంగారు పడుతుంది. అయినా అది అంత సులువైన విషయం కాదని అంటుంది. తాను పెడతానని, రవిని కూడా తనతో తీసుకెళ్తానని అనడంతో నీతూలో భయం మొదలవుతుంది. శృతి నిజంగానే రెస్టారెంట్ పెడుతుందా? రవిని తీసుకెళ్లిపోతుందా అని నీతూ ఆలోచనలో పడుతుంది.

ఇటు ఇంటిపై ముగ్గురు అన్నదమ్ము...