భారతదేశం, అక్టోబర్ 14 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో తన ఫ్రెండ్ కోసం బాలు పేరు చెప్పి మీనా మరోసారి గుణతో ఫైట్ చేస్తుంది. దీంతో బాలు అడ్డు తొలగించుకోవాలని గుణ ప్లాన్ చేస్తాడు. మరోసారి దినేష్ ను రంగంలోకి దింపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బాలు, మీనా వల్ల తనకు ఎప్పుడూ నష్టమే అంటూ మనోజ్ ఆవేశంతో రగిలిపోయే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 14) ఎపిసోడ్ మొదలైంది. తాను చదువులో తప్ప అన్నింట్లోనూ ఫెయిలవుతున్నానని బాధపడతాడు. తనకు ఎందులోనూ కలిసి రావడం లేదని రోహిణిని చూస్తూ అంటాడు. నన్ను చూస్తూ ఆ మాట ఎందుకన్నావ్.. నేనేం చేశాను అని మనోజ్ ను నిలదీస్తుంది రోహిణి.

అక్కడే ఉన్న ప్రభావతి వెంటనే గదిలోకి వస్తుంది. ఎందుకు చూడకూడదే.. నీవల్లే వాడికి ఈ కష్టాలు.. వాడు ఎప్పుడు బాగు పడ...