భారతదేశం, జూలై 16 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో బాలు తనకు వచ్చిన ట్రిప్ కోసం వెళ్లగా.. ఇటు మీనా మాత్రం డబ్బు కోసం నానా తంటాలు పడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో రవి, శృతి ఆమెకు అండగా నిలుస్తారు. అటు చింతామణి ప్లాన్ విని ప్రభావతి ఎగిరి గంతేస్తుంది.

సీరియల్ గురువారం (జులై 16) ఎపిసోడ్ మొదట్లోనే బాలు, మీనా తాము ఒకరికొకరం అనుకునే సీన్ బాగా ఆకట్టుకుంటుంది. మీనా దొరకడం తన అదృష్టం అని బాలు అంటాడు. తాను కూడా చదువు మధ్యలో ఆపడం వల్లే మీరు దొరికారు.. అది నాా అదృష్టం అని మీనా అంటుంది. ఒకరికొకరం ఇలా తోడుగా ఉంటే ఇద్దరం కలిసి ఒక్కో మెట్టు పైకి ఎక్కొచ్చని అనుకుంటారు.

ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీనాతో బాలు ప్రేమగా ఉంటాడు. కిచెన్ లోనే కాసేపు రొమాన్స్ జరుగుతుంది. ఈ సమయంలోనే ఆర్డర్ ...