భారతదేశం, సెప్టెంబర్ 30 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తన చేతికి డబ్బు అందగానే చింతామణికి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంది మీనా. మరోవైపు రవి, శృతికి రెస్టారెంట్ లో పర్ఫెక్ట్ పార్థు పరీక్ష ఎదురవుతుంది. ఇటు చింతామణి ఆర్డర్ చెక్ బౌన్స్ అయి చేజారుతుంది.

ఇంటికి రాగానే మీనా మనుషులు డబ్బు తీసుకెళ్లిన విషయం తెలిసి చింతామణి షాక్ తింటుంది. పరుగెత్తుకుంటూ పైకి వెళ్లి తన గదిలో చూస్తే డబ్బు కనిపించదు. వాళ్లు కచ్చితంగా మీనా మనుషులే అని ఆమెకు అర్థమవుతుంది. అప్పుడే మీనా నుంచి ఆమెకు ఫోన్ వస్తుంది. నువ్వు దొంగతనం చేసిన డబ్బును మా ఆయన మళ్లీ తీసుకొచ్చాడు.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని మీనా అంటుంది.

నా ఇంట్లో దొంగతనం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చింతామణి అంట...