భారతదేశం, సెప్టెంబర్ 25 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మీనా డబ్బు పోవడం వెనుక చింతామణి హస్తమే ఉందని ఫిక్సయిపోతాడు బాలు. ఆ డబ్బును తీసుకురావడానికి అదిరిపోయే ప్లాన్ వేస్తాడు. దానికి కామాక్షి సాయం చేస్తుంది. అటు అరుణ్ కి కూడా ఈ దోపిడీ విషయం తెలిసిపోతుంది.

బాలు, మీనా ఆటలు చూసి మండిపడిన ప్రభావతిని సత్యం గదిలోకి తీసుకెళ్లే సీన్ తో సీరియల్ శుక్రవారం (సెప్టెంబర్ 25) ఎపిసోడ్ మొదలైంది. ఇప్పుడీ ఆటలేంటి అని ప్రభావతి విసుక్కుంటుంటే.. సత్యం తమ పాత రోజులను గుర్తు చేస్తాడు. రాజుగారి తోట నుంచి నీ కోసం మల్లెపూలు, కనకాంబ్రాలు తుండుగుడ్డలో తీసుకొచ్చి వేయలేదా అని అంటాడు.

ఆ రోజులు గుర్తు చేసుకొని ప్రభావతి కూడా సిగ్గు పడుతుంది. ఫస్ట్ నైట్ రోజు కూడా నువ్విలాగే బాటిల్ బదులు పాల గ్లాసు ...