భారతదేశం, జూలై 8 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ మొత్తం మనోజ్ సర్జరీ, అందుకు అవసరమైన డబ్బు కోసం బాలు పడే తంటాల చుట్టూ తిరిగింది. అయితే బాలు ఇంత చేసినా రోహిణి బుద్ధి మారకపోవడమే ఈ ఎపిసోడ్ లో అసలు హైలైట్. అన్నను చూసి బాలు బాగా ఎమోషనల్ అవుతాడు.

మనోజ్ కళ్లలో గాజు పెంకలు తీసేశామని డాక్టర్ చెప్పే సీన్ తో సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ మొదలైంది. అది విని బాలు శపించిన విషయం గుర్తు చేసుకుంటుంది ప్రభావతి. వెంటనే అతని చెంప పగలగొడుతుంది. మనోజ్ కళ్లకు ఏమైనా జరిగితే నీ ముఖం జీవితంలో మళ్లీ చూడను అని అంటుంది. దీంతో బాలు కూడా ఫీలవుతాడు.

అటు మనోజ్ ను హాస్పిటల్ కు తీసుకొచ్చిన వాళ్లు కూడా అక్కడ గొడవ పెట్టుకుంటారు. ఏం జరిగిందని బాలు అడుగుతాడు. మీ అన్న ఎవరినో తరుముతూ వెళ్లాడని, తమకు చాలా నష్టం జ...