భారతదేశం, జూన్ 1 -- Gujarat Titans: ఐపీఎల్ 2026 ఫైనల్ కంప్లీట్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ వరుసగా రెండో సారి విక్టరీ ఖాతాలో వేసుకుంది. సగర్వంగా కప్ ముద్దాడింది. గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో ఓడింది. అయితే మ్యాచ్ ముగిశాక చాలా సేపటి తర్వాత గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు నడి రోడ్డుపై కనిపించారు. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

ఐపీఎల్ 2026లో రన్నరప్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియం నుంచి హోటల్ కు ఆటగాళ్లను తీసుకెళ్లే బస్సు రోడ్డు మీద ఆగిపోయింది. దట్టమైన పొగ అలుముకుంది. అప్పుడు ఆటగాళ్లు అందులోనే ఉన్నారు.

బస్సులో దట్టమైన పొగ అలుముకున్న సమయంలో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు అందులోనే ఉండటంతో తీవ్ర కలకలం రేగింది. కానీ సెక్యూరిటీ సిబ్బంది త్వరగా స్పందించి ఆటగాళ్లను దించేశారు. ఈ పరిణామం...