భారతదేశం, జూన్ 19 -- GU OTT: మలయాళ చిత్ర పరిశ్రమ రూటెడ్ ఫోక్‌లోర్, జానపద ఆచారాలు, ఫాంటసీ హారర్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి సినిమాలు తీయడంలో ఎప్పుడూ ఒకడుగు ముందే ఉంటుంది. ఆ కోవలోనే వచ్చి, విభిన్న చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న 'గు' (GU) మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. థియేటర్లో రిలీజైన రెండేళ్ల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రావడం గమనార్హం.

2024 మే నెలలో థియేటర్లలో రిలీజ్ అయి, అదే ఏడాది జూలైలో మళ్లీ రీ-రిలీజ్ అయిన హారర్ థ్రిల్లర్ 'గు'మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడీ మూవీ రెండేళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ముందుకు రావడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇవాళ (జూన్ 19) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'మనోరమ మ్యాక్స్' లో ఈ మిస్టరీ డ్రామా అధికారికంగా ప్రసారమవుతోంది.

మను రాధాకృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ 'గు' చిత్రం కేరళ ...