భారతదేశం, నవంబర్ 21 -- ఇప్పుడు ప్రపంచం మొత్తం 'గ్రాండ్ థెప్ట్ ఆటో 6' గురించే మాట్లాడుకుంటోంది! మరీ ముఖ్యంగా గేమింగ్ లవర్స్​.. ఈ జీటీఏ 6ని ఆడేందుకు ఎగబడుతున్నారు. చాలా మంది సెలవులు తీసుకుని, కాలేజీలు స్కిప్ చేసి మరీ ఈ మచ్ అవైటెడ్ గేమ్​ని ఎక్స్​పీరియెన్స్ చేస్తున్నారు. అయితే, ఎప్పటిలానే ఈసారి కూడా ఈ గేమర్స్​ ఈ గేమ్​లో చీట్ కోడ్స్ కోసం వెతుకుతున్నారు. ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ X/S కన్సోల్‌ల్లో ఏకంగా 61 చీట్ కోడ్స్‌ను రాక్‌స్టార్ గేమ్స్ అందుబాటులో ఉంచింది. ఆయుధాలు, వాహనాలు, పాత్రల సామర్థ్యాలు, వాతావరణ మార్పులు, విజువల్ ఎఫెక్ట్స్ వంటి ఎన్నో రకాల కోడ్స్ ఇందులో ఉన్నాయి.

అయితే ఈసారి రాక్‌స్టార్ గేమ్స్ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది; ఆటగాళ్లు ఈ చీట్ కోడ్స్‌ను ఉపయోగించాలంటే ముందుగా గేమ్‌లోని మెయిన్ స్టోరీ క్యాంపెయిన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంద...