భారతదేశం, మార్చి 27 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా రూ. 217 కోట్ల స్కామ్ బయపడింది. సుమారు రూ. 1,472 కోట్ల విలువైన ఇన్‌వాయిస్ లావాదేవీలకు పాల్పడిన ఒక భారీ నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) సిండికేట్‌ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) విశాఖపట్నం జోనల్ యూనిట్ వెలికితీసింది.

ఇద్దరు కీలక వ్యక్తులు సిద్దగోని ప్రభాకర్, రమావత్ నాగరాజు నాయక్‌లను అధికారులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న దంట్ల ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డి ఈ నెట్‌వర్క్‌కు సూత్రధారిగా ఉన్నట్లు విచారణలో తేలింది.

డీజీజీఐ ప్రకారం, అసాధారణమైన జీఎస్టీ రిజిస్ట్రేషన్లు, రుణాలకు సంబంధించిన సమాచారం ఆధారంగా ఈ కేసు వెలుగులోకి వచ్చింది. డేటా విశ్లేషణ, రిస్క్ ప్రొఫైలింగ్, క్షేత్రస్థాయి పరిశీలనను ఉపయోగించారు. నిజానికి వ్యాపార కార్యకలాపాలు లేకపోయినా.. భారీ స్థ...