భారతదేశం, సెప్టెంబర్ 22 -- సెప్టెంబర్ 22, అంటే నవరాత్రి పండుగ మొదటి రోజు నుంచి కొత్త వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లు అమల్లోకి రావడంతో పలు వస్తువుల ధరలు తగ్గాయి. కొన్ని వస్తువులకు జీఎస్టీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. మొత్తం 50కి పైగా వస్తువులపై ఇప్పుడు జీఎస్టీ లేదు!

సెప్టెంబర్ 3న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పరోక్ష పన్నుల వ్యవస్థలో భారీ మార్పులకు ఆమోదం లభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం వల్ల రూ. 2 లక్షల కోట్ల వరకు ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని, దీని వల్ల వారి చేతిలో ఖర్చు పెట్టడానికి ఎక్కువ డబ్బు ఉంటుందని తెలిపారు.

ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలు, ప్రాణాలను రక్షించే మందులు, స్టేషనరీ వస్తువులపై పన్నును పూర్తిగా రద్దు చేశారు. దీని వల్ల వినియోగదారులకు, సామాన్య కుటుంబాలకు నేరుగా ప్రయోజనం ...