భారతదేశం, నవంబర్ 4 -- 'గ్రో'గా ప్రాచుర్యం పొందిన బిల్లియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈరోజు, నవంబర్ 4 2025న మొదలైంది. ఈ గ్రో ఐపీఓ నవంబర్ 7, 2025 వరకు బిడ్డింగ్‌కు అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఐపీఓ గ్రే మార్కెట్​ ప్రీమియం (జీఎంపీ) ఎంత ఉంది? ఐపీఓకి అప్లై చేయాలా? వద్దా? నిపుణులు ఏమంటున్నారు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

గ్రో ఐపీఓ జీఎంపీ: స్టాక్​ మార్కెట్ పరిశీలకుల ప్రకారం.. బిల్లియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ షేర్లు గ్రే మార్కెట్‌లో రూ. 17 ప్రీమియంతో లభిస్తున్నాయి. అంటే గ్రో ఐపీఓ లిస్ట్​ ప్రైజ్​ బ్యాండ్​ కన్నా రూ. 17 ఎక్కువలో లిస్ట్​ అవుతుందని అంచనా!

గ్రో ఐపీఓ తేదీ: ఈ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభమై నవంబర్ 7, 2025 వరకు బిడ్డింగ్‌కు అందుబాటులో ఉంటుంది.

ప్రైజ్​ బ్యాండ్​:...