భారతదేశం, ఆగస్టు 21 -- Govinda Wife: బాలీవుడ్ ఐకానిక్ కామెడీ కింగ్ గోవిందా, ఆయన భార్య సునీతా అహుజాల విడాకుల డ్రామాలో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం ఫ్యామిలీ కోర్టులో వేసిన విడాకుల పిటిషన్‌ను సునీత ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టులో సడన్‌గా వెనక్కి తీసుకోగా.. ఈ వివాదంలో డ్రామా క్వీన్ రాఖీ సావంత్ ఎంట్రీ ఇచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది. "రూ. 200 కోట్ల ఆస్తిని ముందు కాపాడుకో" అంటూ సునీతకు రాఖీ ఇచ్చిన ఫోన్ కాల్ సలహా వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

ముంబైలో ఫొటోగ్రాఫర్ల ముందే సునీతా అహుజాకు రాఖీ సావంత్ స్పీకర్ ఫోన్ కాల్ చేసింది. ఈ సంభాషణలో విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి గల కారణాన్ని సునీత ఓపెన్‌గా బయటపెట్టింది.

గోవిందా, ఆయన కొత్త సినిమా హీరోయిన్ కోమల్ రాణి స్వర్ణకార్‌ను పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారనే...