భారతదేశం, అక్టోబర్ 11 -- నిరుద్యోగులకు శుభవార్త అందించింది నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL). ఈ సంస్థలో మొత్తం 34 డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 4న మొదలైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు NHIDCL అధికారిక వెబ్‌సైట్ www.nhidcl.com ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది.

ఈ పోస్టుల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు! అభ్యర్థుల గేట్​ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) స్కోర్ ఆధారంగా NHIDCL మెరిట్ జాబితాను తయారు చేస్తుంది. 2023, 2024 లేదా 2025 సంవత్సరాల్లో చెల్లుబాటు అయ్యే గేట్​ స్కోర్‌ సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు...