భారతదేశం, అక్టోబర్ 5 -- పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు, అనుభవజ్ఞులైన నిపుణులకు ఈ అక్టోబర్ నెల భారీ నోటిఫికేషన్ల లైనప్‌తో వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖలతో పాటు ప్రముఖ బ్యాంకులు, భారతీయ రైల్వేలు, పారామిలిటరీ బలగాలు, ఫార్మా రంగాలు వేలాది పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాయి. అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా సకాలంలో దరఖాస్తు చేసుకోవడం శ్రేయస్కరం.

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఖాళీగా ఉన్న 207 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును అక్టోబర్ 5, 2026 వరకు పొడిగించింది. ఇందులో జోనల్ హెడ్, రీజినల్ హెడ్, రిలేషన్‌షిప్ మేనేజర్, ఇన్‌వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్, వైస్ ప్రెసిడెంట్ (వీపీ) వెల్త్ వంటి కీలక పదవులు ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉ...