భారతదేశం, జూన్ 12 -- Gopichand Singa: టాలీవుడ్ యాక్షన్ హీరో, మ్యాచో స్టార్ గోపీచంద్ అభిమానులకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ అందింది. ఆయన హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను చిత్ర బృందం పంచుకుంది. వైవిధ్యమైన, ఇంపాక్ట్‌ఫుల్ కథాంశాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన '70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ద్వారా ప్రముఖ స్టంట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి 'సింగా' (Singa) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ వదిలిన గ్లింప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది...