భారతదేశం, జూలై 24 -- ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ గూగుల్ అకౌంట్ అత్యంత కీలకంగా మారింది. ఫొటోలు, ఈమెయిల్స్, ముఖ్యమైన డాక్యుమెంట్లు.. ఇలా అన్నీ జీమెయిల్ ఖాతాతోనే ముడిపడి ఉంటాయి. అయితే, ఒక్కోసారి పాస్‌వర్డ్ మర్చిపోయినప్పుడు లేదా మన ఫోన్, కంప్యూటర్ అందుబాటులో లేనప్పుడు అకౌంట్ ఓపెన్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ టెక్ దిగ్గజం గూగుల్ ఒక సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే 'సెల్ఫీ వీడియో' లాగిన్ విధానం.

ఈ కొత్త ఆప్షన్ ద్వారా యూజర్లు తమ ముఖాన్ని ఒక చిన్న వీడియో రూపంలో రికార్డ్ చేసి, తమ ఐడెంటిటీని నిర్ధారించుకోవడం ద్వారా అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గూగుల్ ఒక అధికారిక బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.

ఈ రికవరీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే యూజర్లు ముందే తమ గూగుల్ అకౌంట్‌లో ద...